పెద్దపల్లి: జిల్లాలో వీధి కుక్కల దాడుల నివారణ, వాటి నియంత్రణకు ప్రభుత్వం జారీచేసిన జీవో నంబరు15ను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో వీధికుక్కల నియంత్రణ, ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పరిధిలో వీధి కుక్కల సమస్యను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. జెడ్పీ సీఈవో నరేందర్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వేణుగోపాల్‌రా వు, డీసీవో శ్రీమాల తదితరులు పాల్గొన్నారు.
వీధి కుక్కలను నియంత్రించాలి
Nov 11 2026 12:07 AM | Updated on Nov 11 2026 12:07 AM
108లో ప్రసవం ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇస్లావత్ అంజలి(26) సోమవారం అర్దరాత్రి పురుటి నొప్పులు రావడంతో 108లో ఆస్పత్రికి తరలించరు. మార్గమధ్యంలోనే 108 సిబ్బంది డెలివరీ చేశారు. ఈఎంటీ ఆరే సతీశ్, పైలెట్ సరిపురం కిషన్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స చేశారు. అంజలికి బాబు జన్మించగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బందికి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇంటర్‌సిటీ.. మూడుగంటలు ఆలస్యం ఓదెల: సికింద్రాబాద్ నుంచి సిర్‌పూర్‌కాగజ్‌నగర్ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం సుమారు మూడు గంటల పాటు ఆలస్యంగా నడిచింది. అప్, డౌన్.. రెండువైపులా మూడు గంటలకుపైగా ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓదెల, పెద్దపల్లి, జమ్మికుంట, రాంగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్ల నుంచి సికింద్దాబాద్ వరకు టికెట్లు తీసుకున్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ రైలు లేక నరకయాతన పడ్డారు.
నేటి నుంచి ఫెస్టివల్ స్పెషల్ రైలు రద్దు రామగుండం: దసరా, దీపావళి పండుగల రద్దీ నేపథ్యంలో గతనెల 9 నుంచి సికింద్రాబాద్–సిర్‌పూర్ కాగజ్‌నగర్ మధ్య నడుస్తున్న ఫెస్టివల్ స్పెషల్ రైలు (07711/12)ను ఈనెల 11నుంచి రద్దు కానుంది. ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభించడంతో నిరంతరం కొనసాగించే అవకాశాలున్నట్లు సమాచారం అందింది. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు సైతం రెగ్యులర్‌గా కొనసాగించాలని, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్ రైలుగా నామకరణం చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులకు విన్నవించగా సానుకూలత వ్యక్తమైంది. దీంతో ఆ రైలును రెగ్యులర్‌గా కొనసాగిస్తారనే భావించారు. కానీ, ఈనెల 10తోనే ప్రత్యేక రైలు గడువు పూర్తవుతున్నా కొనసాగింపుపై ద.మ.రైల్వే నుంచిఉత్తర్వులు వెలువడలేదు.
Advertisement


