‘కాప్‌–31’ పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

‘కాప్‌–31’ పోస్టర్‌ ఆవిష్కరణ

Nov 10 2026 1:19 AM | Updated on Nov 10 2026 1:19 AM

‘కాప్‌–31’ పోస్టర్‌ ఆవిష్కరణ

గోదావరిఖని: టర్కీలోని అంటాల్యాలో నేటి నుంచి (నవంబర్‌ 9– 20) జరుగుతున్న 31వ అంతర్జాతీయ వాతావరణ మార్పుల సదస్సును పురస్కరించుకుని సోమవారం ఆర్జీ–1 జీఎం కార్యాలయంలో గ్రీన్‌ వారియర్‌, సింగరేణి విశ్రాంత ఉద్యోగి జేవీఎస్‌ చంద్రశేఖర్‌తో కలిసి జీఎం డి.లలిత్‌కుమార్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా జీఎం మాట్లాడుతూ, సదస్సులో జీరో వేస్ట్‌, సముద్రాల రక్షణ, యువత–విద్య, స్వచ్ఛమైన ఇంధనం, జీవవైవిధ్యం, ఆరోగ్యవ్యవస్థల బలోపేతంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో నిరంతరం అవగాహన కల్పిస్తున్న చంద్రశేఖర్‌ను అభినందించారు. ఎన్విరాన్మెంట్‌ ఆఫీసర్‌ వేణు, సెక్యూరిటీ అధికారి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement