ఆర్టీసీ ప్రత్యేక ఫోన్‌ నంబర్లు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ప్రత్యేక ఫోన్‌ నంబర్లు

Nov 10 2026 1:19 AM | Updated on Nov 10 2026 1:19 AM

విద్యానగర్‌(కరీంనగర్‌): ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలోని బస్‌ స్టేషన్లకు సంబంధించి అవసరమైన సమాచారాన్ని ప్రయాణికులకు అందజేయడానికి ప్రత్యేక ఫోన్‌ నంబర్లును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆర్‌ఎం బి.రాజు తెలిపారు. గోదావరిఖని 94413 35701, పెద్దపల్లి 90631 56348, సుల్తానాబాద్‌ 94924 46028, హుస్నాబాద్‌ 73828 52772, హుజూరాబాద్‌ 73820 73005, జమ్మికుంట 83411 43730, జగిత్యాల 94933 10269, కరీంనగర్‌ 99592 25931, కోరుట్ల 73825 34960, మంథని 73828 25923, మెట్‌పల్లి 90105 73250, సిరిసిల్ల 73823 12927, వేములవాడ 73828 51729 నంబర్లలో సమాచారం కోసం సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

అమరవీరుల ఆశయ సాధనకు ఉద్యమించాలి

పెద్దపల్లి: విప్లవోద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి బి.భాస్కర్‌ పిలుపునిచ్చారు. సోమవారం పెద్దపల్లి ప్రెస్‌ క్లబ్‌లో కె.విశ్వనాథ్‌ అధ్యక్షతన అమరవీరుల వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యుదయ రచయితల సంఘం నాయకులు ఏలేశ్వరం వెంకటేశం మాట్లాడుతూ, తెలంగాణ, నక్సల్బరి, శ్రీకాకుళం, గోదావరి లోయ, దండకారణ్య పోరాటాల్లో వేలాది మంది విప్లవకారులు అమరులయ్యారని తెలిపారు. తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షుడు ముడి అడుగుల మల్లన్న మాట్లాడుతూ, అమరుల స్ఫూర్తితో దున్నేవానికి భూమి, సమసమాజ స్థాపన లక్ష్యా ల కోసం పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ, ఎల్‌నినో, తుపాన్లతో రాష్ట్ర రైతాంగం పంట నష్టాలను ఎదుర్కొందని తెలిపారు. పౌర హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమికూరు లక్ష్మణ్‌ మాట్లాడుతూ, పంటలు నష్టపోయిన రైతులను ప్ర భుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. డీటీఎఫ్‌ కార్యదర్శి గుమ్మడి కొమురన్న, ఐఎఫ్‌ టీయూ జిల్లా అధ్యక్షుడు దాంక లచ్చన్న, ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎల్‌.భీమన్న, మైపాల్‌, పుష్పాక దేవన్న, మల్లేశం, సీహెచ్‌ ఐలయ్య, చంద్రయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement