కోల్‌సిటీ(రామగుండం): చదువు పూర్తయింది.. మంచి ఉద్యోగం వచ్చింది.. ఇక జీవితంలో స్థిరపడవచ్చని చాలామంది భావిస్తారు. కానీ, అతడి ఆ లోచన అందుకు భిన్నం. ఉన్నత విద్యలో ప్రతిభ క నబరిచి బంగారు పతకం సాధించాలన్న సంకల్పం బలంగా నిలిచింది. అందుకోసం ఉద్యోగ జీవితా న్ని పక్కనపెట్టి మళ్లీ విద్యార్థిగా మారాడు గోదావరిఖనికి చెందిన ఇంజ పురి రవితేజ. స్థానిక గాంధీనగర్‌కు చెందిన సింగరేణి కార్మికు డు ఇంజపురి నర్స య్య, విజయలక్ష్మి దంపతుల పెద్ద కు మారుడు రవితేజ. గోదావరిఖని సెయింట్ పాల్స్ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ కరీంనగర్‌లోని ఎస్ఆర్ కాలేజీ, వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా ఉద్యోగం సాధించాడు. కాగా, ఎంటెక్‌లో గోల్డ్ మెడల్ సాధించాలన్న సంకల్పంతో ఉద్యోగాన్ని పక్కనపెట్టి మళ్లీ చదువుల బాట పట్టాడు. బీటెక్ చదివిన వాగేశ్వరి కళాశాలలోనే ఎంటెక్ సీఎస్ఈలో ప్రవేశం పొంది ఎంటెక్ సీఎస్ ఈలో యూనివర్సిటీస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాడు. కళాశాల గ్రాడ్యుయేషన్ డే లో బంగారు పతకాన్ని అందుకున్నాడు. కుటుంబం కోసం తండ్రి పడిన శ్రమను దగ్గరగా చూసిన రవితేజ.. తన విజయంతో వారికి ఆనందాన్ని పంచాలనుకున్నా డు. అందుకే సాధించిన బంగారు పతకాన్ని తల్లిదండ్రులకు అంకితం చే శాడు. ఇద్దరు కుమారులు, కుమార్తెను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న నర్సయ్య దంపతుల ఆశయానికి పె ద్ద కుమారుడి విజయం మరింత ఆనందాన్నిచ్చింది. తనకు తానే కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని అందుకోవడమే అతడి విజయగాథలోని ప్రత్యేకత.


