యైటింక్లయిన్కాలనీ: సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి ఆరోపించారు. స్థానిక ప్రెస్భవన్లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓసీపీ–3లో ప్రైవేట్ డ్రిల్లింగ్ మిషన్ను అద్దె ప్రాతిపదికన తీసుకొచ్చారని, దానికి మరమ్మతు చేయడం వంటి పనులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి చేపట్టే కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణకు గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ సహకరిస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులకు నష్టం కలిగించే చర్యలను టీబీజీకేఎస్ వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. నాయకులు చంద్రయ్య, తిరుపతి, శ్రీనివాస్, శశాంక్, బి.శ్రీనివాస్, నరేందర్, మహేందర్, పి.శ్రీనివాస్, దినేశ్, దక్షణామూర్తి తదితరులు పాల్గొన్నారు.


