గోదావరిఖని: డిస్మిస్డ్ కార్మికులందరికీ వన్‌టైం సెటిల్మెంట్ కింద ఉద్యోగాలివ్వాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికులకు నష్టదాయకంగా ఉన్న సర్క్యులర్‌ను రద్దు చేయాలన్నారు. సింగరేణి వ్యాప్తంగా 600 మంది డిస్మిస్డ్ కార్మికులు ఉన్నారని, గుర్తింపు కార్మిక సంఘం కుదుర్చుకున్న ఒప్పందంతో ఒక్క డిస్మిస్డ్ కార్మికునికి కూడా లబ్ధి చేకూరడం లేదని విమర్శించారు. వారికి నష్టదాయకంగా ఉన్న సర్క్యులర్‌ను రద్దు చేసి, జేఎంఈటీలకు కల్పించిన మాదిరిగానే డిస్మిస్డ్ కార్మికులందరికీ వన్ టైమ్ సెటిల్మెంట్ కింద ఒకఅవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు సతీశ్, నాగేందర్, కార్తీక్, తోట శ్రీకాంత్, ఆర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


