పోలీసులపై విశ్వాసం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

పోలీసులపై విశ్వాసం పెంచాలి

Nov 8 2026 12:13 AM | Updated on Nov 8 2026 12:13 AM

గోదావరిఖని: బాధితులతో సున్నితత్వం, గౌరవప్రదంగా వ్యవహరించి పోలీస్‌ వ్యవస్థపై విశ్వాసం పెంపొందించా లని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా సూచించారు. తన కార్యాలయంలో కోర్టు డ్యూటీ, లైజనింగ్‌ పోలీస్‌ అధికారులతో శనివారం వివిధ అంశాలపై సమీ క్షించారు. కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి, బలమైన సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించాలని అన్నారు. పలు కేసుల్లో నిందితులకు శిక్షలు ప డేలా కీలకపాత్ర పోషించిన వారిని శాలువాలతో సత్కరించారు. అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) శ్రీనివాస్‌, వర్టికల్‌ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement