మంథనిరూరల్: శ్రీపాద్ మార్గ్ ఫోర్ వే కోసం చేపట్టే భూసేకరణకు రై తులు సహకరించాలని మంథని ఆ ర్డీవో సురేశ్ కోరారు. మల్లెపల్లిలో శ నివారం నిర్వహించిన గ్రామసభ లో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే ఒకసారి భూసేకరణకు సర్వే చేట్టామని, అందులో కొందరు రైతుల పేర్లు తప్పిపోయాయని, ఇందుకోసం మరోసారి సర్వే చేయిస్తామన్నారు. భూమి కోల్పోయే ప్రతీ ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. సర్పంచ్ లక్కాకుల సత్యనారాయణ, తహసీల్దార్ అరీఫొద్దీన్, జీపీవో సతీశ్, సర్వేయర్ రాజశేఖర్, ఉపసర్పంచ్ రాజమల్లు, వార్డు సభ్యులు ప్రశాంత్, శైలజ, రైతులు పాల్గొన్నారు.


