జల్సాలకు అలవాటు పడి.. బైక్‌ దొంగగా మారి | - | Sakshi
Sakshi News home page

జల్సాలకు అలవాటు పడి.. బైక్‌ దొంగగా మారి

Nov 7 2026 12:06 AM | Updated on Nov 7 2026 12:06 AM

పెద్దపల్లిరూరల్‌: జల్సాలు, ఇతర అవసరాల కోసం సులువుగా డబ్బు సంపాదించాలనుకుని బైక్‌ దొంగతనాలు చేయాలనుకున్న బైరి నరేశ్‌.. అందుకు పెద్దపల్లిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రని ఎంచుకున్నాడు. కొన్ని నెలలుగా 8 బైక్‌లు ఎత్తుకెళ్లాడు. శుక్రవారం మంథని ఫ్‌లైఓవర్‌ వంతెన వద్ద పోలీసులకు చిక్కాడు. ఏసీపీ గజ్జి కృష్ణ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లికి చెందిన బైరినరేశ్‌ ప్రస్తుతం పెద్దపల్లిలోని హనుమాన్‌నగర్‌లో నివాసముంటున్నాడు. కొంతకాలం బసంత్‌నగర్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేసి అనారోగ్యానికి గురయ్యాడు. ఆ తర్వాత తనకు అవసరమైన డబ్బును సులువుగా సంపాదించేందుకు బైక్‌ దొంగతనాలను ఎంచుకుని జిల్లా ప్రభుత్వాస్పత్రి ముందు పార్కింగ్‌ చేసిన బైక్‌లను ఆగస్టు నుంచి ఎత్తుకెళుతూ తన ఇంటి పరిసరాల్లో దాచాడు. ఇప్పటివరకు ఎత్తుకెళ్లిన 8 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటిని ఒకేసారి మహారాష్ట్రలో అమ్మేందుకు యత్నిస్తున్నట్టు విచారణలో వెల్లడించాడు. సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై రాజశేఖర్‌, హెడ్‌కానిస్టేబుల్‌ మాడిశెట్టి రమేశ్‌, ప్రభాకర్‌, అనిల్‌కుమార్‌ను డీసీపీ రాంరెడ్డి నాయక్‌ అభినందించారు.

మద్యానికి బానిసై ఒడిశా కార్మికుడి మృతి

మంథని: అనారోగ్యంతో బాధపడుతూ మద్యానికి బానిసైన ఒడిశా కార్మికుడు మృతి చెందిన ఘటన మంథని మండలం చిల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో పరిషె బిశ్వాల్‌(35) మృతి చెందాడు. ఎస్సై సందీప్‌ కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన పరిషె బిస్వాల్‌ చిల్లపల్లిలో ఇటుకలు తయారు చేసేవాడు. రెండేళ్లుగా ఆరోగ్యం సరిగా లేక రోజూ మద్యం తాగుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా నేలపై పడి అస్వస్థతకు గురయ్యాడు. భార్య పార్వతీ బిస్వాల్‌ అక్కడే ఉన్న సూపర్‌వైజర్‌కు సమాచారం ఇవ్వగా 108 ద్వారా మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement