రోడ్లపైనే ధాన్యం | - | Sakshi
Sakshi News home page

రోడ్లపైనే ధాన్యం

Nov 6 2026 11:42 PM | Updated on Nov 6 2026 11:42 PM

చీరలతోనూ భద్రం

అప్పుడే ఎండ.. ఆ వెంటే మేఘావృతం.. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని అయోమయం.. ప్రస్తుతం వానాకాలం వరి పండించిన అన్నదాతకు ఎదురవుతున్న విపత్కర పరిస్థితులు ఇవి. వరి పంట కోసి ధాన్యం తూర్పారబట్టి ఎండబెట్టేందుకు రైతులు మరో సమస్య ఎదుర్కొంటున్నారు. ఎక్కడ రహదారి కనిపించినా దానిపై వడ్లు ఆరబోస్తున్నారు. కాలినడకన వెళ్లేవారే కాదు.. వాహనదారులూ ప్రమాదాల బారినపడతామని ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లా కొలనూర్‌ – ఓదెల మధ్య కిలోమీటర్ల మేర రహదారిపై ధాన్యం ఆరబోసి దృశ్యాలు ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించాయి.

దీపావళి వేళ బంతిపూల తోటలు కనువిందు చేస్తున్నాయి. పచ్చని ఆకుల మధ్య పసుపు, నారింజ రంగుల్లో విరబూసిన బంతిపూలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి ఒడిలో రంగులు అద్దుకుంటున్న పూలవనాలు పండుగ శోభను ముందుగానే తీసుకొస్తూ పల్లె అందాలకు మరింత వన్నె తెస్తున్నాయి. ఓదెల మండలం కొలనూర్‌ సమీపంలో ‘సాక్షి’కి కనిపించిన అందాలతోట ఇది.

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామ శివారులో ఓ రైతు వేసిన మిరప పంట రక్షణకు వినూత్న ఆలోచన చేశాడు. మొక్కలకు రక్షణ కల్పించేందుకు తోట చుట్టూ రంగురంగుల చీరలతో పరదా అడ్డుగా ఏర్పాటు చేశాడు. అతడి ఆలోచనలను పలువురు అన్నదాతలు అభినందిస్తున్నారు.

బంతిపూల వనం

– సాక్షి ఫొటోగ్రాఫర్‌,

పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement