కమాన్‌పూర్: కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలోని అనేకమంది అర్హులైన వారు దరఖాస్తు చేశారు. దసరా పండుగ సందర్భంగానే పింఛన్లు అందిస్తామని చెప్పినా ఇంకా అమలుకాలేదు. దీపావళి పండుగు వస్తున్నా ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. దీంతో కొత్త పింఛన్‌దారుల్లో నిరాశ నెలకొంది. పింఛన్ సొమ్ము తమకు కొండంత అండ ఇస్తుందనే ఆశతో వేలాది మంది ఎదురు చూస్తున్నారు.
జిల్లాలో 15,259 దరఖాస్తులు
చేయూత పింఛన్ల కోసం గత ఆగస్టు 9 నుంచి సె ప్టెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో జి ల్లాలోని వితంతువులు, దివ్యాంగులు, గీతకార్మికు లు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులతోపాటు బోదకాలు, డయాలసిస్ బాధితులు మొత్తంగా.. 15,259 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు సెప్టెంబర్ 30 వరకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి 11,320 మందిని పింఛన్లకు అర్హులుగా గుర్తించారు. అయితే, దీపావళి పండుగకై నా కొత్త పింఛన్ అందుతుందా? అని వీరంతా ఎంతోఆశతో ఎదురుచూస్తున్నారు.


