తక్కువ నీరు.. స్వల్పకాలికం | - | Sakshi
Sakshi News home page

తక్కువ నీరు.. స్వల్పకాలికం

Nov 6 2026 11:42 PM | Updated on Nov 6 2026 11:42 PM

ఎల్‌నినోను అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళిక

వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు

రైతులకు ఉచితంగా కూరగాయల విత్తన కిట్లు

పెద్దపల్లిరూరల్‌: ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు యాసంగిలో సాగు చేసేందుకు ఆసక్తి ఉన్న రైతులు.. సాగునీటి లభ్యతను బట్టి ప్రణాళిక రూపొందించుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో.. తక్కువ నీటివినియోగంతో స్పల్పకాలంలో దిగుబడి వచ్చే పంటలనే సాగు చేసేలా జాగ్రత్తలు పాటించాలని ఉద్యానవన అధికారులూ అవగాహన కల్పిస్తున్నారు.

ప్రతీనీటిచుక్క సద్వినియోగం కావాలి

ఎల్‌నినోతో భూగర్భజలాలు అడుగంటే ప్రమాదముంది. ఈ పరిస్థితుల్లో ప్రతీ నీటి చుక్కను సద్వినియోగం చేసుకునేలా రైతులు పక్కా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగడం మంచిది. ఈ యాసంగిలో సాగుకు సరిపడా నీరు లేకుంటే భూమిని పడావుగా ఉంచినా ఫర్వాలే దు. లేదంటే పెట్టుబడి పెట్టి న ష్టాల పాలయ్యే అవకాశాలుంటాయి. ఈమేరకు రైతులను అప్రమత్తం చేసేలా అధికారు లు ప్రచారం సాగిస్తున్నారు.

ఉచితంగా కూరగాయల కిట్లు

వరికి ప్రత్యామ్నాయంగా కూ రగాయలు సాగు చేసుకోవా లని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌సీ) ద్వారా ఉచితంగా ఏడు రకాల కూరగాయల విత్తనాలు (సొర, బెండ, బీర, బబ్బెర, తోటకూర, పాలకూర, గోరుచి క్కుడు) ఉన్న కిట్‌ బ్యాగులను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈవిత్తనాలు 10 గుంటల విస్తీర్ణంలో సాగు చేసేందుకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement