పెద్దపల్లి: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి కొమురయ్య డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న ఎన్హెచ్ఎం ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని శుక్రవారం సందర్శించి సంఘీభావం తెలిపారు. ఏళ్లుగా ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు కె.రాజు, ఎన్హెచ్ఎం సంఘం నాయకులు స్కైలాబ్ రాణి, నర్మద, రవళి, మేఘమాల, కొమురయ్య, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.


