కోల్‌సిటీ: మరణానంతరం కళ్లదానం ద్వారా మరొకరు ప్రపంచాన్ని చూడటం కంటే గొప్ప సేవ మరో టి లేదని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. తిలక్‌నగర్ కాంగ్రెస్ డివిజన్ మాజీ అధ్య క్షుడు నంది వెంకటేశ్ తల్లి రాజేశ్వరి ఇటీవల మృతి చెందగా ఆమె నేత్రాలను దానం చేశారు. ఈ సంద ర్భంగా శుక్రవారం ఆమె నివాసంలో ఏర్పాటు చేసి న సంస్మరణసభలో మేయర్ మాట్లాడారు. తల్లిని కోల్పోయిన బాధలోనూ నేత్రదానానికి ముందుకొచ్చిన కుటుంబం ఔదార్యం ఆదర్శమన్నారు. కాంగ్రెస్ మున్సిపల్ మాజీ అధ్యక్షుడు బొంతల రాజేశ్, నగర అధ్యక్షుడు ఎండీ ముస్తఫా, కార్పొరేటర్ గట్ల రమేశ్, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు పాల్గొన్నారు. అదేవిధంగా బాపూజీనగర్‌కు చెందిన కిరాణా వ్యాపారి బైరి కిరణ్ ఇటీ వల మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులు కూడా నేత్రాలను దానం చేశారు. ఫౌండేషన్ ప్రతినిధులు ఆరెపల్లి రాజమౌళి, కేఎస్ వాసు, శశికళ తదితరులు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యుల కు అభినందన పత్రం అందజేశారు.
మాట నిలబెట్టుకున్నాం
జ్యోతినగర్: పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అప్పగించి మాట నిలబెట్టుకున్నామని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రెండోడివిజన్ జంగాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పనులను ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్ల య్య, కార్పొరేటర్ కంకణాల మౌనిక, ముస్తాఫా, కాల్వ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.


