దళారులకు ధాన్యం విక్రయించొద్దు | - | Sakshi
Sakshi News home page

దళారులకు ధాన్యం విక్రయించొద్దు

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

● ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

సుల్తానాబాద్‌ రూరల్‌: దళారులకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎ మ్మెల్యే విజయరమణారావు సూచించారు. గర్రెపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నారాయణరావుపల్లి, గొల్లపల్లి, సాంబయ్యపల్లి, దుబ్బపల్లి, ఐతరాజుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొ నుగోలు కేంద్రాలను ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. యాసంగిలో ఆరుతడి పంట లు సాగు చేయాలని సూచించారు, ప్రధానంగా మొక్కజొన్న, తెల్లజొన్న, నువ్వులు తదితర వాణిజ్య పంటలు సాగు చేస్తే అధిక ఆదాయం సమకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రకాశ్‌రావు, సింగిల్విండో చైర్మన్‌ కల్లేపల్లి జానీ, సర్పంచ్‌లు స్వరూప, భాగ్యలక్ష్మి, శోభ, భూమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement