ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

పెద్దపల్లి: వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీరాములు ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలన్నారు. వానాకాలం –2026 ధాన్యం కొనుగోళ్లపై గురువారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈసారి 4.69 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని, మద్దతు ధరతోపాటు క్వింటాల్‌పై రూ.500 బోనస్‌ వర్తింపజేస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో అన్నిసౌకర్యాలు కల్పించాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్‌, మేనేజర్‌ శ్రీకాంత్‌, సహకార అధికారి శ్రీమాల, మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement