పెద్దపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గ ర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందించడం, ప్ర భుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంపు తదితర అంశాలపై కలెక్టరేట్లో గురువారం సమీక్షించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 50 శాతం ప్రసవా లు జరుగుతున్నాయని, వీటిని 70 శాతానికి పెంచా లన్నారు. ఆశకార్యకర్తల ద్వారా గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని తరచూ పర్యవేక్షించాలని అన్నారు. గో దావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రతీనెల క నీసం 200 ప్రసవాలు జరిగేలా కార్యాచరణ రూ పొందించుకోవాలని సూచించారు. ఎయిడ్స్ సురక్షిత కార్యక్రమంలో జిల్లా జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతోపాటు వైద్య సిబ్బందికి అవార్డులు అందజేసి అభినందించారు. డీఎంహెచ్‌వో పవిత్ర, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, గోదావరిఖని జీజీహెచ్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్‌పై నివేదిక ఇవ్వండి
ఆక్రమిత భూముల రిజిస్ట్రేషన్లపై చట్టపరమైన అంశాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదుర య్యే సమస్యలు, పరిష్కార మార్గాలను విశ్లేషించి ని వేదిక అందించాలని సూచించారు. అనంతరం వీబీ జీ రాంజీ పథకం ద్వారా మంజూరైన గ్రామాల్లో వీ వో భవనాల నిర్మాణ పురోగతి సమీక్షించారు. డీఆ ర్డీవో కాళిందిని, డీసీవో శ్రీమాల, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ, డీఎల్పీవో దేవకీదేవి పాల్గొన్నారు.


