భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో డిస్మిస్డ్ కార్మికులకు తిరిగి ఉద్యోగావకాశాలు కల్పించడం ఏఐటీయూసీ పోరాట ఫలితమేనని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. ఈ విజయాన్ని ఇతర కార్మిక సంఘాలు తమ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. భూపాలపల్లి ఏరియాలోని కొమురయ్య భవన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందాల్లో డిస్మిస్డ్ కార్మికుల పునర్నియామక అంశాన్ని చేర్చామని, సమ్మె నోటీసులు, నిరంతర పోరాటం ఫలితంగా ప్రభుత్వం, యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి గురిజపల్లి సుధాకర్‌రెడ్డి, భీమనాధుని సత్యనారాయణలు పాల్గొన్నారు.


