వైద్య సిబ్బందికి భద్రత ఏది? | - | Sakshi
Sakshi News home page

వైద్య సిబ్బందికి భద్రత ఏది?

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

● సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ● ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్‌ ● కొనసాగుతున్న వైద్య, ఉద్యోగుల సమ్మె

పెద్దపల్లి: జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. ఏళ్ల తరబడి వైద్య సేవలు అందిస్తున్నా ఉద్యోగ భద్రత లేక, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభించక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ 24 రోజులుగా సమ్మె చేస్తున్నారు.

వైద్యసేవలకు అంతరాయం

జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు 464 మంది ఉండగా 350 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధుల వైద్యసేవల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యామ్నాయ సిబ్బందితో సేవలు కొనసాగిస్తున్నా క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత సమస్యగా మారుతోంది.

ఇవీ ప్రధాన డిమాండ్లు

● ఉద్యోగులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలి

● సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

● జీవో నంబర్‌ 1195 ప్రకారం వేతన సవరణ చేపట్టాలని డిమాండ్‌

● కాంట్రాక్టు ఉద్యోగులకు స్టేట్‌ హెల్త్‌ సొసైటీ ద్వారానే వేతనాలు చెల్లించాలి

● ప్రతి నెల 5వ తేదీలోగా జీతాలు విడుదల చేయాలి. పెండింగ్‌లోని 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్‌, 8 శాతం లాయల్టీ బోనస్‌ మంజూరు చేయాలి

● ఈహెచ్‌ఎస్‌, గ్రూప్‌ పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలి

● మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి

● విధుల్లో ఉండగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కారుణ్య నియామకాలు కల్పించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement