● సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి
గోదావరిఖని: సీపీఐ నేతల అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని ఆ పార్టీ జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం సుల్తానాబాద్‌లో పర్యటించిన సందర్భంగా గోదావరిఖనిలో నెలకొన్న సమస్యలపై ఆయన మాట్లాడారు. తిలక్‌నగర్, ఎల్బీనగర్ల అభివృద్ధి పేరుతో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ చిరు వ్యాపారులను ఇబ్బందుల గురిచేస్తున్నారని మండిపడ్డారు. కూల్చివేతలు ప్రారంభించి నెలలు గడుస్తున్నా పురోగతి లేదన్నారు. ఈక్రమంలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేస్తే సీపీఐ నాయకులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించి కార్పొరేటర్ మార్కపురి సూర్యతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సీపీఐ నాయకులపై సీఐ వ్యవహరించిన తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య, జిల్లా సమితి సభ్యుడు శనగరపు చంద్రశేఖర్, ఏఐవైఎఫ్ కార్యదర్శి ఆరేపల్లి మానస్కుమర్ ఉన్నారు.


