సింగరేణిస్థాయి ఫుట్‌బాల్‌ విజేత ఆర్జీ–1, 2 | - | Sakshi
Sakshi News home page

సింగరేణిస్థాయి ఫుట్‌బాల్‌ విజేత ఆర్జీ–1, 2

Nov 6 2026 2:08 AM | Updated on Nov 6 2026 2:08 AM

● బహుమతులు అందజేసిన జీఎం లలిత్‌కుమార్‌

గోదావరిఖని: స్థానిక జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు ఉత్సాహభరితంగా సాగిన సింగరేణిస్థాయి క్రీడాపోటీలు గురువారం ముగిసాయి. 11 ఏరియాల జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఫైనల్‌ మ్యాచ్‌లో ఆర్జీ–1, ఆర్జీ–2 జట్టు విజేతగా నిలవగా, మందమర్రి, బెల్లంపల్లి జట్టు రన్నరప్‌గా నిలిచింది. ముగింపు వేడుకలకు ఆర్జీ–వన్‌ జీఎం లలిత్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు. జీఎం మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా మానసిక స్థైర్యాన్ని, క్రమశిక్షణను పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో ఆర్జీ–1 సేవా అధ్యక్షురాలు అనిత, క్వాలిటీ జీఎం వెంకటరమణ, సేఫ్టీ జీఎం మల్లయ్య, రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్‌వోటూ జీఎం జీఎం చంద్రశేఖర్‌, ఏఐటీయూసీ బ్రాంచ్‌ సెక్రటరీ రంగు శ్రీనివాస్‌, ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు క్రాంతి కుమార్‌, మల్లేశ్‌, సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ శ్రావణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement