గోదారిఖని: గోదావరినదిలో నీటి నిల్వలు తగ్గిపోతున్న క్రమంలో భవిష్యత్ అవసరాల కోసం కార్మిక కుటుంబాలు పొదుపుగా వాడుకోవాలని ఆర్జీవన్ జీఎం లలిత్‌కుమార్ కోరారు. బుధవారం గోదావరినది ఇంటక్వెల్ సమీపంలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. వేసవిలో ఎదురయ్యే నీటి సమస్య, ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు. నీటి సరఫరా వ్యవస్థలో వాల్వ్ ఆపరేటర్లతో సమానంగా పంప్ ఆపరేటర్లు, ఫిట్టర్లకు కూడా బాధ్యతగా పనిచేయాలని అన్నారు. అనంతరం నీటి పొదుపును వివరించే పోస్టర్ ఆవిష్కరించారు. ఎస్వోటూ జీఎం చంద్రశేఖర్, ఏరియా పర్యావరణ అధికారి వేణు, డిప్యూటీ ఎస్ఈ రాజు, ఈఈ ప్రణీత్ సిబ్బంది ఉన్నారు.


