రామగిరి: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం జాప్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీ రావు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ ఎం.రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆర్జీ–3 ఏరియా జీఎం కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. జీఎంకు వినతిపత్రం అందజేశారు. ఆర్ఎల్సీ సమక్షంలో జరిగిన ఒప్పందాలకు వెంటనే సర్క్యులర్ జారీ చేయాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపాలని, ఒప్పందాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారి క్రాంతి, డీటీ రావు, గంగాధర్, నక్క రమేశ్, గంధం శ్రీనివాస్, ఎం.సురేశ్, పోశం తదితరులు పాల్గొన్నారు.


