పెద్దపల్లి: ప్రజాసమస్యలను గాలికొదిలేసి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. కలెక్టరేట్ ఎదుట 23 రోజులుగా సమ్మె చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు బుధవారం ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రజలకు వైద్య సేవలు అందించే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదష్టకరమన్నారు. వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకు మద్దతు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఉద్యోగ సంఘం నాయకులు మహేందర్, స్కైలాబ్ రాణి, గొర్రె స్వరూప, మారుతి, మాణికేశ్వర్, అనిత, మౌనిక, అనూష, బుచ్చమ్మ, సంతోష్, నర్మద, నిర్మల, రవళి తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ 6న భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు
మంథని: విద్యార్థుల్లో దేశభక్తి, నైతిక విలువలను పెంపొందించడమే లక్ష్యంగా విశ్వహిందూ పరిషత్ సంస్కార శిక్షణ విభాగం ఆధ్వర్యంలో శ్రీమద్భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నట్లు వీహెచ్‌పీ ప్ర ఖ ండ అధ్యక్షుడు రావుల సతీశ్ తెలిపారు. భగవద్గీత లో ని ఎంపిక చేసిన శ్లోకాలతో పోటీలు నిర్వహిస్తున్న ట్లు పేర్కొన్నారు. డిసెంబరు 6న పెద్దపల్లిలో జిల్లాస్థాయి, హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వ హించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగలవారు 9951 490553 నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.
ఎన్టీపీసీలో కోతుల పట్టివేత
జ్యోతినగర్: నగర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల బెడదను నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ తెలిపారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో ప్రత్యేక బృందాలతో బుధవారం కోతులను పట్టించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తొలిరోజు సుమారు వంద కోతులను పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించామని వివరించారు.
మాతా, శిశు మరణాల నివారణకు చర్యలు
పెద్దపల్లి: జిల్లాలో మాతా, శిశు మరణాల నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి పవిత్ర సూచించారు. మాతా, శిశు మరణాలపై డీఎంహెచ్‌వో కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. మాతృ, శిశు మరణాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా వైద్య సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలన్నారు. ప్రోగ్రామ్ అధికారులు సుధాకర్‌రెడ్డి, కిరణ్ కుమార్, లక్ష్మీ భవాని, అతుల్య, డీపీహెచ్‌ఎన్‌వో దయామణి పాల్గొన్నారు.


