డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం

Nov 4 2026 11:46 PM | Updated on Nov 4 2026 11:46 PM

యైటింక్లయిన్‌కాలనీ: గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనపై జమాత్‌ ఏ ఇస్లామీ హింద్‌ సంస్థ ఆర్టీిసీ బస్సుల్లో ప్రచారం చేస్తోంది. గోదావరిఖని – పెద్దపల్లి బస్సులో ప్రయాణికులకు అవగాహన కల్పించారు. సబీరా నాజ్‌, ఐషా సిద్దిఖా, ఎండీ ఇస్మాయిల్‌, దీపిక ఫౌండేషన్‌ కన్వీనర్‌ భాగ్యలక్ష్మి, మండల ఇన్‌చార్జి సుప్రత్‌ఖానం తదితరులు పాల్గొన్నారు.

గంజాయి పట్టివేత

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌ శివారులోని ఇటుకబట్టీల్లో పనిచేసే కూలీలకు విక్రయించేందుకు వచ్చిన వ్యక్తి నుంచి కిలో 160 గ్రాముల గంజాయి (రూ.58 వేల విలువ)ని బుధవారం స్వాధీనం చేసుకున్నట్టు రూరల్‌ ఎస్సై మధూకర్‌ తెలిపారు. జనగాం జిల్లా బచ్చన్నపేటకు చెందిన లోకేశ్‌ (ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం) నాగపూర్‌ నుంచి గంజాయి తీసు కొచ్చి ఇటుకబట్టీల్లో పనిచేసే ఒడిశా కూలీలకు విక్రయించేందుకు తిరుగుతున్నాడు. అను మానాస్పదంగా తిరుగుతున్న ఆయనను అదుపులోకి తీసుకొని బ్యాగు తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై వివరించారు.

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి పట్టణంలోని సాగర్‌ రోడ్డుకు చెందిన ఆసిఫాఅంజుమ్‌(24) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆరేళ్ల క్రితం అంజుమ్‌కు ఓదెల మండలం గూడెం గ్రామానికి చెందిన అఫ్రోజ్‌తో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. భర్త అఫ్రోజ్‌తో తరచూ గొడవలు జరిగేవి. దీంతో ఆమె కొద్దిరోజుల క్రితం పిల్లలను భర్తవద్దే వదలి పుట్టింటికి వచ్చింది. భర్త వద్దకు వెళ్లాలని పెద్దలు సూచించినా.. వినిపించుకోలేదు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు.

28న నవోదయ ప్రవేశ పరీక్ష

చొప్పదండి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 28న జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 కేంద్రాల్లో పరీక్ష కోసం ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దరఖాస్తు చేసిన 3,888 మంది విద్యార్థుల హాల్‌ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. హాల్‌ టికెట్లలో ఏవైనా తప్పులు ఉంటే ఈనెల 20వ తేదీలోగా చొప్పదండిలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement