జీఎం లలిత్‌కుమార్‌కు వినతిపత్రం అందిస్తున్న నాయకులు
ఆర్జీ–2లో..
గోదావరిఖని: సింగరేణి యాజమాన్యంతో ఏఐటీయూసీ చేసుకున్న ఒప్పందం రాజకీయ జోక్యంతోనే అమలు కావడం లేదని ఆ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ ఆరోపించారు. బుధవారం సింగరేణి ఆర్జీవన్ జీఎం కార్యాలయం వద్ద ముట్టడి కార్యక్రమం నిర్వహించి జీఎం లలిత్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్మికుల పెండింగ్ సమస్యలపై ఆగస్టు 27న రీజనల్ లేబర్ కమిషనర్ (ఆర్‌ఎల్‌సీ) వద్ద 23 డిమాండ్లపై కుదిరిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు యాజమా న్యం సర్క్యులర్‌లు జారీ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అర్హులైన డిపెండెంట్లకు నెలరోజుల్లోగా ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆర్జీ–1 బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను, నాయకులు మాదన మహేశ్, సంకె అశోక్, బోగ సతీశ్‌బాబు, ఎస్.వెంకట్‌రెడ్డి, సిద్దమల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
ఆర్జీ–2 ఏరియాలో..
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్జీ–2 ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీఎం ఆఫీస్ ముట్టడి నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్మికుల సమస్యలు ఇప్పటికై నా పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు రాజారత్నం, సాంబశివరావు, శ్యాంసన్, మహేందర్, రవికుమార్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.


