గోదావరిఖని: కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించినా సింగరేని పట్టించుకోవడం లేదని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను కూడా జాప్యం చేయడం సిగ్గు చేటన్నారు. 234 మంది అర్హులైన అభ్యర్థులకు కారుణ్య నియామకాల ఉత్తర్వులు జారీ చేయాలని, పెర్క్స్‌పై ఆదాయపన్ను మినహాయింపు, జనరల్ అసిస్టెంట్‌లకు పదోన్నతి కల్పించాలని, 190/240 మస్టర్లు పూర్తి చేసిన జనరల్ అసిస్టెంట్ ట్రైనీలకు వెంటనే ప్రమోషన్ ఇవ్వాలని కోరారు. అలియాస్ పేర్లు, పేర్లలోని వ్యత్యాసాలకు సంబంధించిన పెండింగ్ కేసులన్నింటినీ పరిష్కరించాలని, ప్రతీ నెల మెడికల్ బోర్డు నిర్వహించాలని అన్నారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణే ఐఎన్‌టీయూసీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నాయకులు సదానందం, వికాస్‌కుమార్‌యాదవ్, వడ్డేపల్లి దాస్, కోట రవీందర్ రెడ్డి, శేషారత్నం, ఆరెపల్లి శ్రీనివాస్, లలిత, శ్రీనివాస్, ఖాదర్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.


