గోదావరిఖని: యువకార్మికులు క్రీడా పోటీల్లో చురుగ్గా పాల్గొనాలని ఆర్జీ వన్ జీఎం లలిత్‌కుమార్ సూచించారు. స్థానిక సింగరేణి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి స్థాయి ఫుట్‌బాల్ పోటీలు బుధవారం ప్రారంభించారు. జీఎం మాట్లాడుతూ, స్టేడియం అభివృద్ధికి రూ.2.5కోట్లు కేటాయించారన్నారు. జాతీయ స్థాయి హాకీ క్రీడాకారుడైన సీఎండీ మార్గనిర్దేశంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్జీ–1 సేవా అధ్యక్షురాలు అనిత, క్వాలిటీ రీజియన్ జీఎం వెంకటరమణ, ఎస్‌వోటూ జీఎం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రెండురోజుల పాటు ఫుట్‌బాల్ పోటీలు
సింగరేణి స్థాయి పుట్‌బాల్ పోటీలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. తొలిరోజు నాలుగు జట్ల మధ్య పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. మందమర్రి, బెల్లంపలి వర్సెస్ ఇల్లెందు, మణుగూరు జట్లు పోటీ పడగా మందమర్రి, బెల్లంపల్లి జట్టు 3.1తో గెలుపొందింది. రెండో మ్యాచ్ కొత్తగూడెం, కార్పొరేట్ వర్సెస్ శ్రీరాంపూర్ జట్టు తలపడగా డ్రాగా ముగిసింది. మూడో మ్యాచ్ ఆర్జీ–3, భూపాలపల్లి వర్సెస్ ఇల్లెందు మణుగూరు జట్టు పోటీపడగా 2.1 తేడాతో ఇల్లెందు, మణుగూరు జట్టు విజయం సాధించింది. నాలుగో మ్యాచ్‌లో ఆర్జీ వన్, ఆర్జీ–2 వర్సెస్ శ్రీరాంపూర్ జట్టు పోటీపడగా 3.1తేడాతో ఆర్జీవన్, టూ జట్టు విజయం సాధించింది.


