కాంగ్రెస్‌ విధ్వాంసాలను ఎండగట్టాలి | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ విధ్వాంసాలను ఎండగట్టాలి

Nov 4 2026 11:46 PM | Updated on Nov 4 2026 11:46 PM

గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వ, ప్రజాఆస్తులను కూల్చివేస్తున్న కాంగ్రెస్‌ చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలని టీబీజీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసు రామమూర్తి కోరారు. స్థానిక యూనియన్‌ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన ఆర్‌జీవన్‌ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధిని సూచిస్తూ ఏర్పాటు చేసిన పైలాన్‌ను దొడ్డిదారిన కూల్చివేయడం ఆక్షేపనియమన్నారు. సింగరేణి క్వార్టర్లను కూల్చివేసి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించడం, సింగరేణి స్థలాల్లో కార్మికేతరులకు భవనాలు నిర్మించుకోవడానికి అనుమతించడం, కార్మికుల షెడ్లను కూల్చివేయడం లాంటివి సరికాదన్నారు. నాయకుడు వడ్డేపల్లి శంకర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూనె కొమురయ్య, పర్లపల్లి రవి, పోలాడి శ్రీనివాసరావు, దూట శేషగిరి, కొండ్ర అంజయ్య, ఉప్పులేటి తిరుపతి, వాసర్ల జోసెఫ్‌, ఎ.గోపి, జనగామ మల్లేశ్‌, మహేందర్‌రెడ్డి, రహమాన్‌, పులిపాక శంకర్‌, మీస రాజు, కళాధర్‌రెడ్డి, అఫ్సర్‌, రొడ్డ సంపత్‌, వెంకట్‌రెడ్డి, భాస్కర్‌, సంపత్‌, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement