పెద్దపల్లి: జిల్లాకు చెందిన చిప్ప సౌమ్య, వే ము ల హరి జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపిక కా వడం గర్వకారణమని పద్మశాలీ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల రామ్మూర్తి అన్నారు. స్థానిక అమర్‌చంద్ కల్యాణ మండపంలో ఆదివారం యువ జడ్జిలను ఘనంగా సత్కరించా రు. యువత వారిని ఆదర్శంగా తీసుకుని వి ద్యలో రాణించాలని సూచించారు. సంఘం జి ల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సత్తయ్య, గుండేటి రాజేశ్, ప్రధాన కార్యదర్శి ఐల రమేశ్, జాయింట్ సెక్రటరీ సాయిరి మహేందర్, ప్రచార కార్యదర్శి ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.
వరి పంటకు సాగునీరు
పెద్దపల్లి: చివరి ఆయకట్టుకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతుండగడా.. ఎస్సారెస్పీ నుంచి ఇటీవల 1,100 క్యూసెక్కులు విడుదల చేశారు. లస్క ర్లు కాలువల వెంట కాపలా కాస్తూ తూములు మూస్తూ చివరి ఆయకట్టుకూ సాగునీరు అందేలా చూస్తున్నారు. జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్ నుంచి ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాలకు సాగునీటిని కాలువల ద్వారా తరలిస్తున్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు, స్థానిక ప్రజాప్రతినిదులు, అధికారుల చొరవ తో పంటలకు సాగునీరు అందుతోంది.
అలంకారప్రాయం.. క్రీడాప్రాంగణం
పెద్దపల్లిరూరల్: మున్సిపల్ పరిధిలో క్రీడాప్రాంగణం ఏర్పాటుకు అనువైన స్థలం లేక అ ప్పన్నపేటలోని ఎస్సారెస్పీ డీ– 83 కాలువ తీ రంలో తెలంగాణ క్రీడాప్రాంగణం అనే బోర్డు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. దీనికి ఒకవైపు శ్మశానవాటిక, మరోవైపు ఎస్సారెస్పీ కాలువ, ఇంకోవైపు రాజీవ్ రహదారి ఉన్నాయి. ఆటలాడుకునేందుకు అనువుగా లేదు. అయి నా, క్రీడాప్రాంగణం ఏర్పాటు చేశామని చెప్పుకునేందుకు ఇలా ఓ బోర్డు ఏర్పాటు చేశారని క్రీడాకారులు వాపోతున్నారు.
వ్యాసరచన పోటీలు
గోదావరిఖని: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా రా మగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పె ద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన విద్యా ర్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తామని సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న వారోత్సవాల్లో ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నామన్నారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూలో పోటీలు ఉంటాయన్నారు. ఆరు నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు ‘సైబర్ నేరాల నివారణలో పోలీసు–పౌరుల పాత్ర, డ్రగ్స్ మెనేస్ ని వారణలో పోలీసుల పాత్ర – విద్యార్థులు డ్రగ్స్ కు ఎలా దూరంగా ఉంటారు’ అంశాలపై పోటీ లుంటాయన్నారు. డిగ్రీ– పీజీ విద్యార్థులకు ‘డంలో పోలీసుల పాత్ర, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర’అంశాలపై పోటీలు ఉంటుందన్నారు. విద్యార్థులు తమ వ్యాసాలను ఈనెల 26వ తేదీలోపు సమర్పించాలని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు http s://forms.gle/YkeKUscWu5LFYWFH7 లింక్‌లో సంప్రదించాలని సీపీ కోరారు.
నేత్రదానానికి అంగీకారం
జ్యోతినగర్: ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీలో ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం(రేవా), హిందూ వాహిని ఆధ్వర్యంలో సదాశయ ఫౌండేషన్ సహకారంతో నేత్ర, అవయవదానంపై ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా తిరుమల సురేందర్‌గౌడ్, వరుణ్ తేజ, బొమ్మగాని ప్రశాంత్, బండ సన్నిహిత్, పవన్ కుమార్, బోర్లకుంట అనిల్‌కుమార్, ఆరేపల్లి వెంకటసాయి చరణ్, సాయి సత్తు, సంజీవ్, రా వుల సాయి, విజయ్, రాజయ్య, ప్రసన్నకుమా ర్ నేత్రదానానికి అంగీకారం తెలిపారు. ఠాకూ ర్ సాయి సింగ్ అవయవదానానికి, తంగల్లపెల్లి మధునయ్య శరీరదానానికి ముందుకొచ్చా రు. వీరి నిర్ణయాన్ని అభినందించారు.


