గోదావరిఖని: స్థానిక సింగరేణి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం నిర్వహించే విజయదశమి వేడుకలకు పడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి సందర్భంగా.. రామాయణ గాథను ప్రజలకు చేరువ చేసేలా రామ్‌లీలా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం 35 అడుగుల ఎత్తయిన రావణ కటౌన్ తయారు చేస్తున్నారు. సంస్కృతికి పెద్దపీట వేస్తూ వినోదంతోపాటు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. భారీ ఎత్తున క్రాకర్ షో ఏర్పాటు చేయనున్నారు.
సందడి చేయనున్న కళాకారులు
సినీ కళాకారుడు శివారెడ్డి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జబర్‌దస్త్ ఫేమ్ రాజమౌళి, గడ్డం నవీన్, హరితేజ, సాకేత్, వరమ్, జాహ్నవి, ఇండియన్ ఐడిల్ మూవీ ప్లేబ్యాక్ సింగర్ వాగ్దేవి మూవీ సింగర్ సౌమ్యారావు, రెనుకుమార్, ఇరుముడి విలన్ కొమురన్, ధీషో ఫేం తేజు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్ ఆధ్వర్యంలో వన్‌టౌన్, ట్రాఫిక్ సీఐలు ఇంద్రసేనారెడ్డి, రాజేశ్వర్‌రావు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
నేటి దసరా సంబురాలకు భారీ ఏర్పాట్లు
సినీ కళాకారుల రాక.. పెద్దఎత్తున క్రాకర్స్ షో నిర్వహణకు యంత్రాంగం కార్యాచరణ


