ముత్తారం: సద్దులబతుకమ్మ నిమ్మజ్జనం కోసం కేశనపల్లి కోర్లకుంట చెరువు వద్ద నిర్మించిన ఘాట్‌ను కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం, ఎస్సై రవికుమార్, సర్పంచ్ పెగడ తిరుమలకుమార్‌తో కలిసి ఆదివారం ప్రారంభించారు. మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు పంచాయతీ నిధులతో చెరువు వరకు వీధి దీపాలు ఏర్పాటు చేశారు. మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఉపసర్పంచ్ సింగనవేన సదయ్యయాదవ్, సింగిల్‌విండో మాజీ డైరెక్టర్ చిందం సదానందం, వార్డుసభ్యులు, నాయకులు బక్కతట్ల వినీత్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


