● పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
రామగుండం: రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తన చొరవతోనే నిధులు మంజూరయ్యాయని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేయాలని, పర్యాటకుల కోసం రోప్‌వే ఏర్పాటు చేయాలని, సదుపాయాలు కల్పించాలని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని కోరడంతో సానుకూలంగా స్పందించారన్నారు. అనంతరం కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని ఎంపీతోపాటు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ శాలువాతో సన్మానించారు.


