మంథని: మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మంథనిలో త్వరలో గార్మెంట్ ఫ్యాక్ట రీ ప్రారంభించనున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. దీనిద్వారా 300 నుంచి 400 మందికి ఉ పాధి లభిస్తుందన్నారు. నవంబర్ ఒకటినుంచి ఎంపిక చేసిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించను న్నట్లు వెల్లడించారు. ఆదివారం మంథనిలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అలీఫ్, డీఆర్‌డీఏ, మెప్మా, సీఎస్‌ఆర్ సహకారంతో కుట్టుశిక్షణ పూర్తి చే సుకున్న మహిళలకు సర్టిఫికెట్లు, సీఎం సహాయ ని ధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడా రు. మహిళలు కుటుంబ బాధ్యతలకే పరిమితం కా కుండా ఆర్థికంగా ఎదగాలని సూచించారు. 10 నుంచి 20 మంది మహిళలు కలిసి డెయిరీ యూనిట్లు ఏ ర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. 84 గ్రామ సంఘ భవనాలు మంజూరు చేసి, ఒక్కోదానికి రూ.10 లక్షల చొప్పున కేటాయించినట్లు చెప్పారు. 43 అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త భవనా లు మంజూరు చేయడంతో చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించే అవకాశం ఉంటుందన్నారు. ఎ ల్‌నినో దృష్ట్యా నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డి, విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచే, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షు డు తొట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదు ల వెంకన్న, విండో చైర్మన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు


