పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన అన్ని గ్యారెంటీలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. నేరెళ్ల ఘటన సమయంలో లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమారిని తీసుకొచ్చి న్యాయం చేయాలని పోరాటం చేశామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నేరెళ్ల బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని వివరించారు.


