గోదావరిఖని: అంకితభావంతో, సమర్థవంతంగా పనిచేసే పోలీసులకు మంచి గుర్తింపు లభిస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్‌ఝా అన్నారు. గోదావరిఖని వన్‌టౌ న్ పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ బొజ్జ సురేందర్ బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా కమిషనరేట్‌లో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. సీపీ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అనేక ఏళ్లపాటు అంకితభావంతో విధులు నిర్వహించిన హెడ్‌కానిస్టేబుల్ సురేందర్ సేవలను ప్రశంసనీయమన్నా రు. ఏవో శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సీఐలు శ్రీ నివాస్, భీమేశ్, ఆర్‌ఐ మల్లేశం, సీసీ సందీప్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నవీన్, ఉపాధ్యక్షుడు తిరుపతి, సభ్యులు కపిల్, సురేందర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నిషేధాజ్ఞలు కొనసాగింపు
కమిషరేట్‌లోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌లలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. డీజే, డ్రోన్ల వినియోగంపైనా ఆంక్షలు ఉన్నాయని, ఇవి ఈనెలాఖరువరకు ఇవి అమలులో ఉంటాయన్నారు.
పుష్కరాలకు నిరంతర విద్యుత్
మంథని: వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ట్రాన్స్‌కో సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. స్థానిక గోదావరి పుష్కరఘాట్ లో విద్యుత్ శాఖ చేపట్టాల్సిన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, ఘాట్ పరిసరాల్లో సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆయన సూచించారు. అనంతరం దుబ్బపల్లిలో ఇటీవల చార్జ్ చేసిన ఎస్‌హెచ్‌జీ సోలార్ ప్లాంట్‌ను సీఎండీ పరిశీలించారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఎస్‌ఈ గంగాధర్, డీఈఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభం
మంథని: ఎంగిలి పూల బతుకమ్మ సంబురాలకు ముందు జరుపుకునే బొడ్డెమ్మ వేడుకలు బుధవారం వైభవంగా ప్రారంభించారు. మంత్రపురిగా పిలువబడే మంథని పట్టణంలో శాస్త్రోక్తంగా వేడుకలను నిర్వహిస్తారు. ఆయా వీధుల్లో చిన్నారులు మట్టితో బొడ్డెమ్మను అందంగా తయారు చేసి, వివిధ రంగుల పూలతో పేర్చి ఆటా పాటలతో కొలిచారు.


