● సాయంత్రం 5.00 గంటలకు సీఎం హెలీకాప్టర్ సిరిసిల్లకు చేరింది.
● 5.10 గంటలకు హెలీకాప్టర్ ల్యాండ్ అయింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బా బు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మ ణ్ కుమార్ సీఎం వెంట వచ్చారు.
● 5.15 గంటలకు హెలీప్యాడ్ వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ముఖ్యమంత్రి, మంత్రులకు స్వాగతం పలికారు.
● 5.28 గంటలకు అంబేడ్కర్ సర్కిల్‌కు సీఎం చేరుకున్నారు.
● 5.30 గంటలకు భారీ జనంతో పాదయాత్రగా నేతన్నచౌక్, చంద్రంపేట క్రాస్‌రోడ్డు మీదుగా.. సభా స్థలివరకు కాలినడకన సీఎం వచ్చారు.
● 6.02 గంటలకు సబా స్థలికి చేరుకున్నారు.
● 6.15 గంటలకు జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
● 6.20 గంటలకు వేదికపైకొచ్చి జనానికి అభివాదం చేశారు.
● 6.25 గంటలకు తెలంగాణ రాష్ట్ర గీతంతో సభను ప్రారంభించారు.
● 6.55 గంటల వరకు మంత్రులు ప్రసంగించారు.
● 6.55 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రారంభించారు.
● 7.45 గంటల వరకు సీఎం ప్రసంగించారు.
● 8.00 గంటలకు రోడ్డు మార్గంలో సీఎం హైదరాబాద్ వెళ్లారు.
● అంతకుముందు నల్గొండ గద్దర్ (నర్సిరెడ్డి) పాటలు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల ఆటా, పాటలు అలరించాయి.


