గొల్ల, కురుమలకు సహకారం | - | Sakshi
Sakshi News home page

గొల్ల, కురుమలకు సహకారం

Oct 2 2026 7:20 AM | Updated on Oct 2 2026 7:20 AM

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మారం: కాంగ్రెస్‌ ప్రభుత్వం గొల్ల, కురుమలకు అన్నివిధాలా సహకరిస్తుందని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ భరోసా ఇచ్చారు. మేకలు, గొర్రెలకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించడంతో గొర్రెకాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జంగ మహేందర్‌ ఆధ్వర్యంలో బుధవారం సీఎం రేవంతర్‌రెడ్డి చిత్రపటానికి మండల కేంద్రంలో పాలాభి షేకం చేశారు. మంత్రి హాజరై మాట్లాడారు. ప్రమాదవశాత్తు గొర్రెలు, మేకలు చనిపోయిన ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లామని, స్పందించిన సీఎం.. బీమా పథకం అమలుకు శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జంగ మహేందర్‌యాదవ్‌, యాదవ సంఘం మండల అధ్యక్షుడు దాగేటి ఉదయ్‌ యాదవ్‌, జిల్లా ప్రధానకార్యదర్శి వేల్పుల నాగరాజు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రూప్లానాయక్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సంగ రంజిత్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement