సింగరేణిలో 96 శాతం బొగ్గు ఉత్పత్తి | - | Sakshi
Sakshi News home page

సింగరేణిలో 96 శాతం బొగ్గు ఉత్పత్తి

Oct 2 2026 5:26 AM | Updated on Oct 2 2026 5:26 AM

● దూసుకెళ్తున్న సింగరేణి

గోదావరిఖని: విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలపై సింగరేణి ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధించే ఓసీపీలపై ఒత్తిడి పెంచింది. లక్ష్యాలకు మించి బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీచేసింది. సీఎండీ ప్రతీరోజు వీడియో కాన్షరెన్స్‌ ద్వారా ఉత్పత్తి లక్ష్యా లు సమీక్షిస్తున్నారు. ఈక్రమంలోనే సెప్టెంబర్‌లో ఉత్పత్తి భారీ గా పెరిగింది. మొ త్తం 12 ఏరియాల్లో నాలుగు ఏరియాలు రికార్డుస్థాయి బొగ్గు ఉత్పత్తి సాధించా యి. మిగిలిన ఏరియాల్లోనూ ఉత్పత్తి పెంచాలని అధికారు లు సూచిస్తున్నారు.

లక్ష్య సాధనలో 4 ఏరియాలు నంబర్‌ వన్‌

సింగరేణిలోని 12ఏరియాల్లో నాలుగు ఏరియాలు లక్ష్యాన్ని మించిరికార్డు స్థాయి బొగ్గు ఉత్పతి సాధించాయి. గడిచిన ఆరు నెలల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నాయి. సెప్టెంబర్‌లో 41.26లక్షల టన్నుల లక్ష్యానికి 44.84లక్షల టన్నులు సాధించి 109శాతం చేరుకున్నాయి.

చతికిల పడిన ఏపీఏ

వార్షిక ఉత్పత్తి లక్ష్య సాధనలో అడ్రియాల ప్రాజెక్టు ఏరియా(ఏపీఏ) వెనకపడింది. 1.63లక్షల టన్నుల లక్ష్యానికి 49వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి నిర్దేశిత లక్ష్య సాధనలో 31శాతం, భూపాలపల్లి 37శాతం శ్రీరాంపూర్‌ 44శాతం, కొత్తగూడెం 51శాతంతో వెనకపడ్డాయి. ఈనెలలో వర్షాలు ఎక్కువగా కురవడంతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

సెప్టెంబర్‌లో బొగ్గు ఉత్పత్తి (లక్షల టన్నుల్లో..)

ఏరియా లక్ష్యం సాధించింది శాతం

ఆర్జీ–వన్‌ 18.87 11.90 64

ఆర్జీ–టూ 39.26 39.85 101

ఆర్జీ–3 15.75 10.25 65

ఏపీఏ 1.60 0.49 31

భూపాలపల్లి 18.33 6.72 37

కొత్తగూడెం 5.26 2.67 39

సత్తుపల్లి 58.16 77.76 134

ఇల్లెందు 13.73 9.10 66

మణుగూరు 44.68 61.75 138

బెల్లంపల్లి 14.00 15.53 111

మందమర్రి 11.71 8.48 72

శ్రీరాంపూర్‌ 27.31 12.10 44

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement