వరుస విజయాలు అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

వరుస విజయాలు అభినందనీయం

Oct 2 2026 5:26 AM | Updated on Oct 2 2026 5:26 AM

కరీంనగర్‌ జిల్లా యోగాసన క్రీడల్లో సాధిస్తున్న వరుస విజయాలు అభినందనీయం. 17వసారి చాంపియన్‌గా నిలవడం సాధారణ విషయం కాదు. క్రీడాకారుల ప్రతిభకు, క్రమశిక్షణకు ఇది నిదర్శనం. కరీంనగర్‌ నుంచి మరింత మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షిస్తున్నాం.

– తుమ్మల రమేశ్‌ రెడ్డి, ఒలింపిక్‌ సంఘం ఉపాధ్యక్షుడు

సాధనే విజయానికి బాట

కరీంనగర్‌ క్రీడాకారుల విజయానికి నిరంతర సాధనే ప్రధాన కారణం. ప్రతీ క్రీడాకారుడి సామర్థ్యాన్ని గుర్తించి, వయసుకు అనుగుణంగా శిక్షణ ఇస్తున్నాం. ఆసనాల్లో ఖచ్చితత్వం, శరీర నియంత్రణ, ఏకాగ్రత, సమయపాలనపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించేలా శిక్షణ కొనసాగిస్తాం.

– మల్లీశ్వరి, యోగా కోచ్‌

ఫస్ట్‌ టైమ్‌ నేషనల్‌కు..

12–14 విభాగంలో స్టేట్‌ లెవల్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించా. ఫస్ట్‌ టైమ్‌ నేషనల్‌ మీట్‌కు ఎంపికయ్యా. చాలా హ్యపీ. జాతీయ పోటీల్లో పాల్గొని తెలంగాణకు బంగారు పతకం సాధించాలని ఉంది. స్టేట్‌ లెవల్‌ మీట్‌లో కరీంనగర్‌ చాంపియన్‌ షిప్‌ సాధించడంలో నేను కూడా ఉండడం ఆనందంగా ఉంది.

– బి.రిషిక, బంగారు పతకం విజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement