సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలి

Sep 29 2026 12:33 AM | Updated on Sep 29 2026 12:33 AM

గోదావరిఖని: ప్రజలు, బాధితులు తమ సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించుకునేందుకు పోలీసులను ఆశ్రయించాలని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ఝా తెలిపారు. సోమవారం కమిషనరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో భాగంగా బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

జాతీయ సంఘాలు విఫలం

రామగిరి: సింగరేణి కార్మికుల సమస్యలు పరి ష్కరించడంలో జాతీయ సంఘాలు విఫలమయ్యాయని టీబీజీకేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యా ల రాజిరెడ్డి విమర్శించారు. ఆర్జీ–3 ఉపాధ్యక్షుడు నాగెల్లి సాంబయ్య అధ్వర్యంలో సోమవారం ఏపీఏలో నిర్వహించిన గేట్‌మీటింగ్‌లో మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి, దసరాలోపే కార్మికులకు లాభాల వాటా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఓవర్‌మెన్లు రాజేందర్‌, అనిల్‌రామ్‌తోపాటు పలువురు కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరగా రాజిరెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. నాయకులు నాగెల్లి సాంబయ్య, వీవీ గౌడ్‌, తిప్పారపు తేజ, దేవ శ్రీనివాస్‌, ఈసంపల్లి రమేశ్‌, గట్టు శ్రీనివాస్‌, పాశం శ్రీనివాస్‌రెడ్డి, గండి శ్రీనివాస్‌, బొంగొని శ్రీకాంత్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

దరఖాస్తులు ఆహ్వానం

పెద్దపల్లి: జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి వై.పవిత్ర సోమవారం తెలిపారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ 8, స్టాఫ్‌నర్స్‌ 15, ఎంఎల్‌హెచ్‌పీ 8, ఎస్టీఎల్‌ఎస్‌ 2, ఏఎన్‌ఎం 3, ఫార్మసిస్ట్‌ 1, పాథాలజిస్ట్‌ 1, ఓబీజీ స్పెషలిస్ట్‌ పోస్టులు 2 ఉన్నాయాని తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం కోసం జిల్లా వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు.

1న ఉద్యోగ మేళా

పెద్దపల్లి: జిల్లా ఉపాధిశాఖ, టాస్క్‌ రీజినల్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 1న పెద్దపల్లిలో భారీ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.రాజశేఖర్‌ తెలిపా రు. బస్‌స్టాండ్‌ సమీపంలోని బస్‌డిపో ప్రాంగణంలోని టాస్క్‌ రీజినల్‌ సెంటర్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డ్రైవ్‌ ఉంటుందన్నారు. ఎల్‌.ఎన్‌.గ్రూప్‌, రేడియంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, డీమార్ట్‌, నీమ్యాన్స్‌, టెక్‌ మహీంద్రా తదితర సంస్థలు పాల్గొంటాయన్నారు. పోస్టులను బట్టి నెలకు రూ.13 వేల నుంచి రూ.45 వేల వరకు, ఏడాదికి రూ.3.1 లక్షల నుంచి రూ.4.1 లక్షల వరకు వేతనం ఉంటుందన్నారు. 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, పీజీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు సంస్థలను బట్టి ఆయా పోస్టులకు హాజరుకావచ్చని తెలిపారు.

ఐదుగురు ఎస్సైల బదిలీ

గోదావరిఖని: గోదావరిఖని సబ్‌డివిజన్‌ పరిధిలో ఐదుగురు ఎస్సైను బదిలీ చేస్తూ రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా సోమవారం ఆదేశాలు జారీ చేశారు. రామగుండం ట్రాఫిక్‌లో పనిచేస్తున్న జి.హరిశేఖర్‌ను రామగుండం ఎస్సైగా బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న సంధ్యారాణిని వీఆర్‌కు పంపారు. ఎన్టీపీసీ ఎస్సైగా పనిచేస్తున్న టి.ఉదయ్‌కిరణ్‌ను అంతర్గాంకు బదిలీ చేశారు. అంతర్గాం నుంచి బి.వెంకటస్వామిని ఎన్టీపీసీకి బదిలీ చేశారు. జయశంకర్‌భూపాలపల్లి డీఎస్‌ ఎస్సైగా పనిచేస్తున్న కె.శ్రీనివా స్‌ను గోదావరిఖని వన్‌టౌన్‌ మూడో ఎస్సైగా బదిలీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement