13 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర | - | Sakshi
Sakshi News home page

13 కోట్ల ఓట్లు తొలగించే కుట్ర

Sep 29 2026 12:33 AM | Updated on Sep 29 2026 12:33 AM

మోడీ, అమిత్‌షా కనుసన్నల్లో ఎన్నికల కమిషన్‌ సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌ విప్‌ విజయరమణారావు ఆధ్వర్యంలో నిరసన

పెద్దపల్లి/పెద్దపల్లి రూరల్‌: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని రాష్ట్ర ప్రభు త్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ తీరును నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం విప్‌ విజయరమణారావు మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ పేరుతో తమకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో ఓట్ల తొలగింపునకు మోడీ, అమిత్‌షా కనుసన్నల్లో ఎన్నికల కమిషన్‌ కుట్ర చేస్తోందని ఆరోపించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అన్నయ్యగౌడ్‌, నూగిల్ల మల్లయ్య, బిరుదు రాధాకృష్ణ, ప్రకాశ్‌రావు, మల్లారెడ్డి, చిలుక సతీశ్‌, భాస్కర్‌రెడ్డి, శ్రీగిరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లిలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హరేరామ హరేకృష్ణ ట్రస్టు ద్వారా అల్పాహారం అందించే కార్యక్రమాన్ని డీఈవో శారదతో కలిసి ప్రారంభించారు. తహసీల్దార్‌ రాజయ్య, ఎంపీడీవో శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌, ఎంఈవో సురేంద్రకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement