పెద్దపల్లి: జిల్లాకేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఆదివారం భారీవర్షం కురిసింది. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం ధాటికి కొన్నిచోట్ల వరిపైరు నేలవాలినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్‌ను బద్నాం చేసేందుకే సర్వే
ధర్మారం: నీతి, నిజాయతీగా పట్టా భూములు కొ నుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్న మాజీ సీ ఎం కేసీఆర్‌పై అసత్యపు ఆ రోపణలతో బీఆర్‌ఎస్‌ను బద్నాం చేసేందుకే ప్రభు త్వం భూ సర్వే చేయిస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మండల కేంద్రంలోని వినాయక విగ్రహాల ఎదుట ఆదివారం ప్రత్యేక పూజలు చేశాక విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిలదీస్తున్నందుకే భూకబ్జాల పేరిట ప్రజల దృష్టి పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎంతోపాటు మంత్రులు అక్రమ సంపాదన కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు రాంబాబు, నాయ కులు శ్రీనివాస్, ఆవుల లత పాల్గొన్నారు.
సింగరేణి ఉద్యోగికి అవార్డు
యైటింక్లయిన్‌కాలనీ: జీడీకే ఓసీపీ–3లోని ఈపీ ఆపరేటర్ కనకం రమణయ్య నేషనల్ బిల్డర్ అవార్డు అందుకున్నారు. 40ఏళ్లుగా కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి రోటరీ క్లబ్ ఆఫ్ మెగాసిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు అవార్డు అందజేశారు. ఉపాధ్యాయులు, కళా, క్రీడా, విద్యా, ఉద్యోగ తదితర రంగాల్లోని 82 మందిని అవార్డు కోసం ఎంపికచేశారు. అందులో రమణయ్య కూడా ఉన్నారు. ఆయనను కళాకారులు, సింగరేణి ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు అభినందించారు.
అధికారి పార్టీ కౌన్సిలర్‌కు నోటీసులు
పెద్దపల్లి: సుల్తానాబాద్ బల్దియాలోని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిదో వార్డు కౌన్సిలర్ చింతల రాజుకు మున్సిపల్‌టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీచేశారు. 15వ వా ర్డు బస్టాండ్ వెనకాల వీధిలో నిర్మించిన గ్రౌండ్‌ఫ్లోర్, మొదటి అంతస్తు భవనం రిజిస్ట్రేషన్ పత్రాలు, నిర్మాణ అనుమతులు సమర్పించాల ని కమిషనర్ రమేశ్, టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆదేశిస్తూ నోటీసులు జారీచేశారు. మూడు రోజుల్లోగా మున్సిపల్ కార్యాలయంలో ఆ పత్రాలు సమర్పించాలని అధికారులు అందులో పేర్కొన్నారు. గడువులోగా పత్రాలు అందజేయకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాలతోనే నోటీసులు జారీచేసినట్లు చర్చ సాగుతోంది.
26న టూరిజం క్లబ్స్ పోటీలు
పెద్దపల్లి: విద్యార్థుల్లో పర్యాటక ప్రాంతాలు, సాంస్కృతిక వారసత్వం, పర్యావరణ పరిరక్ష ణ, పర్యాటక ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించేందుకు ఈనెల 26న యువ టూరి జం క్లబ్స్ జిల్లా స్థాయిపోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి సురేశ్ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన పో టీలకు జిల్లాలోని ప్రతీ పాఠశాల, కళాశాల నుంచి ముగ్గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యా యుడు హాజరవ్వాలని సూచించారు. విజేతల కు వేర్వేరుగా నగదు బహుతులు అందిస్తారన్నారు. వివిధ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 99639 60063 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.


