గణేశుని ఆశీస్సులు అందరిపై ఉండాలి | - | Sakshi
Sakshi News home page

గణేశుని ఆశీస్సులు అందరిపై ఉండాలి

Sep 21 2026 7:05 AM | Updated on Sep 21 2026 7:05 AM

● ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మంథని: ప్రజలు సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రతీ పని విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో సజావుగా సాగాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆకాంక్షించారు. స్థానిక రావుల చెరువుకట్ట హనుమాన్‌ ఆలయంలోని గణేశ్‌ మండపంలో ఆదివారం నిర్వహించిన హోమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మహాలక్ష్మీ, గ్రామదేవతలను దర్శించుకున్నారు. లోక కల్యాణం కోసం గణేశుడిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు.

సింగరేణి స్థలాలకు పట్టాలు

సింగరేణి ప్రాంతాల్లో ఏళ్లుగా స్థిర నివాసం ఏర్పరచుకున్న వారికి ఇళ్ల పట్టాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. గతంలో దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో ఇళ్ల పట్టాలు అందించారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేశారు.

పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

ప్రజాసంక్షేమంతోపాటు అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడంతోపాటు వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆయన తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ వొడ్నాల శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ ముస్కుల సహేందర్‌రెడ్డి, విద్యుత్‌ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యుడు శశిభూషణ్‌ కాచే, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్‌, జిల్లా అధికార ప్రతినిధి సెగ్గెం రాజేశ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడుదుల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement