ఆగని కాపర్‌ కేబుల్‌ చోరీలు | - | Sakshi
Sakshi News home page

ఆగని కాపర్‌ కేబుల్‌ చోరీలు

Sep 21 2026 7:05 AM | Updated on Sep 21 2026 7:05 AM

రామగుండం, భూపాలపల్లి ఏరియాలపై దొంగల దృష్టి

నిందితులు రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందినవారే!

సింగరేణి, పోలీస్‌ అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిందే..

గోదావరిఖని/రామగిరి: సింగరేణిలో కాపర్‌ కేబుళ్లు లక్ష్యంగా చోటుచేసుకుంటున్న చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. రాగికి మార్కెట్‌లో మంచిడిమాండ్‌ ఉండటంతో దొంగలు వాటిపైనే దృష్టి సారించారు. ప్రధానంగా ఓసీపీల్లో కేబుళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్జీ–1, 2, 3, ఏపీఏ ఏరియాలతోపాటు భూపాలపల్లి ప్రాంతంలోని ఓసీపీల్లోనూ కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న దొంగతనాలు యాజమాన్యా న్ని కలవరానికి గురిచేస్తున్నాయి.

భూపాలపల్లిలో చిక్కిన దొంగలు

కాపర్‌ కేబుళ్లు చోరీచేస్తూ కొందరు దొంగలు ఇటీవ ల భూపాలపల్లి పోలీసులకు చిక్కారు. కేబుళ్లు తరలించేందుకు వినియోగించే ఒక కారును స్వాధీ నం చేసుకున్నారు.

విచారణ వేగవంతం

భూపాలపల్లిలో చిక్కిన దొంగలను పోలీసులు విచారణ జరుపుతున్నారని సమాచారం. గతంలో జరిగి న కేబుల్‌ చోరీలతో సంబంధాలు ఉన్నాయా? ము ఠాలో ఇంకా ఎవరున్నారు?కాపర్‌ను ఎక్కడ విక్రయిస్తున్నారనే కోణాల్లో విచారిస్తున్నట్లు తెలిసింది.

130 మీటర్ల పొడవైన కాపర్‌ కేబుల్‌ చోరీపై దృష్టి

జీడీకే–10ఏగనిలో ఈనెల 13న సుమారు 130 మీ టర్ల పొడవైన కాపర్‌ కేబుల్‌ చోరీకి గురైంది. అదే రోజు భూపాలపల్లిలోని ఓసీపీ–2 ఆఫీస్‌ సమీపంలో కేబుల్‌ కట్‌ చేస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితులు ఇక్కడి వారే..

ఆర్జీ–3 ఏరియాలో తరచూ కాపర్‌ కేబుళ్లు చోరీకి గురవుతున్నాయి. ఓసీపీ–2 కేబుల్‌ యార్డుపైనా దొంగలు దాడి చేస్తూ రాగితీగ ఎత్తుకెళ్తున్నారు. దీంతో ఈ ప్రాంతంతోపాటు భూపాలపల్లి ఏరియాలో నూ నిఘా పెంచిన పోలీసులు.. విచారణ వేగవంతం చేస్తున్నారు. భూపాలపల్లిలో అదుపులోకి తీసుకున్న వారు గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని న్యూమారేడుపాక, పోతనకాలనీ, రామ గిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బేగంపేట ప్రాంతాలకు చెందినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.

రెండు వాహనాల్లో తరలింపు..

కాపర్‌ కేబుళ్లును తరలించేందుకు దొంగలు రెండు వాహనాలను ఉపయోగిస్తున్నారు. రామగుండం పోలీస్‌కమిషరేట్‌కు ప్రాంతానికి చెందిన నిందితులు రెండు వాహనాల్లో భూపాలపల్లి ఏరియాకు వెళ్లి చోరీలు చేస్తున్నారని చెబుతున్నారు.

కఠినంగా వ్యవహరిస్తేనే..

సింగరేణిలో చోరీలు చోటుచేసుకుంటే ‘తమకేటి’ అ నే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనే విమర్శ లు వస్తున్నాయి. దీంతోనే కేసులు నమోదైనా దొంగలు పదేపదే చోరీలకు పాల్పడుతున్నారని పేర్కొంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో చోరీ లు అరిటకట్టడానికి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే సత్ఫలితాలు వస్తాయంటున్నారు. సింగరేణిలో ని ఇంటిదొంగలపైనా ఓ కన్నేసి చోరీలు నియంత్రించాలని కార్మికులు, అధికారులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement