తవ్వకాల జోరు.. మరమ్మతు చేయరు | - | Sakshi
Sakshi News home page

తవ్వకాల జోరు.. మరమ్మతు చేయరు

Sep 21 2026 7:05 AM | Updated on Sep 21 2026 7:05 AM

● నగరవాసులకు తప్పని ఇబ్బందులు

కోల్‌సిటీ: అభివృద్ధి పనుల పేరిట నగరంలో తవ్వుతున్న సీసీ రోడ్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. తాగునీటి పైప్‌లైన్‌ ఇంటర్నల్‌ కనెక్షన్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ (యూజీడీ) పైప్‌లైన్లను మ్యాన్‌హోల్స్‌కు అనుసంధానం చేసేందుకు రహదారులను తవ్వుతు న్న అధికారులు.. వాటి మరమ్మతును గాలికొదిలే స్తున్నారు. ఏ డివిజన్‌లో చూసినా నిర్లక్ష్యంగా వది లేసిన రోడ్ల దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. మార్కండేయకాలనీ – ఇందిరానగర్‌ మధ్య మెయిన్‌ రో డ్డుపై ఆపిల్‌ కిడ్స్‌ ప్లే స్కూల్‌ ఎదుట సాధనానగర్‌కు తాగునీటి సరఫరా ఇంటర్నల్‌ కనెక్షన్‌ కోసం నాలు గు రోజుల క్రితం సీసీ రోడ్డును తవ్వారు. పనులు ఇంకా ప్రారంభించకపోవడంతో గుంతలు ప్రమాదకరంగా మారాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై ఇరువైపులా రోడ్డు తవ్వడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి దుర్గానగర్‌లోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్‌ హాల్‌ సమీపంలోనూ కనిపిస్తోంది. యూజీడీ పైప్‌లైన్‌ను మ్యాన్‌హోల్‌కు అనుసంధా నం కోసం సీసీ రహదారిని తవ్విన అధికారులు.. వారం రోజులైనా మరమ్మతు చేపట్టకుండా వదిలేశారు. తవ్విన ప్రాంతం గుంతలుగా మారి ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతోంది. పనుల కోసం రోడ్డు తవ్వడం తప్పుకాదు.. తవ్విన రోడ్డును పూ డ్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమే నిర్లక్ష్యం. ఇంజినీర్ల పర్యవేక్షణ ఏ మేరకు ఉందో.. రోడ్ల పరిస్థితి చూస్తేనే అర్థమవుతోందని స్థానికులు మండిపడుతున్నారు. తవ్విన రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేసి ప్రమాదాలను నివారించాలని నగరవాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement