లోక్ అదాలత్‌లో 5,261 కేసుల పరిష్కారం
గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఈనెల 12న నిర్వహించిన జాతీయ మెగా లోక్‌అదాలత్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని 5,261 కేసులు పరిష్కారం అయ్యాయని సీపీ అంబర్ కిశోర్‌ఝా తెలిపారు. కోర్టుల్లో విచారణలో ఉన్న రాజీకి వీలైన కేసుల్లో ప్రత్యేక చట్టాలకు సంబంధించిన 36, ఈ – చలాన్ 2,872, డ్రంకెన్ డ్రైవ్ 1,740 కేసులు పరిష్కరించారన్నారు. 125 సైబర్ క్రైం కేసుల్లో బాధితులకు రూ.33,65,739 బాధితులకు తిరిగి ఇప్పించామని పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా పెట్టీ, ట్రాఫిక్, ఎకై ్సజ్, డ్రంకెన్ డ్రైవ్ తదితర స్వల్ప నేరాల కేసులు వేగంగా పరిష్కారం అయ్యాయన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారం ద్వారా ప్రజలకు సమయం, ధనం ఆదా అయయ్యాయని, కక్షిదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేసుల పరిష్కారానికి సహకరించారని పేర్కొన్నారు. గత 15 రోజులుగా రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు, న్యాయస్థాన సిబ్బంది కేసుల్లోని పక్షాలను స్వయంగా కలిసి, రాజీ మార్గమే ఉత్తమమార్గమని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చని అవగాహన కల్పించారని గుర్తుచేశారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు న్యాయస్థాన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు.


