గోదావరిఖని: లెనిన్‌నగర్‌కు చెందిన బీటెక్ విద్యార్థిని అక్షితరాణి(20) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. శనివారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహ త్యకు యత్నించగా.. కుటుంబ సభ్యులు వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు వేధించడంతోనే అక్షితరాణి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ తర్వాత పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.


