కోల్‌సిటీ: స్థానిక సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్–ప్రభుత్వ) లో మరికొన్ని పీజీ కోర్సు లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే నాలుగు విభాగాల్లో 16 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) కేటాయించింది. జనరల్ సర్జరీలో–4, జనరల్ మెడిసన్‌లో–4, పీడియాట్రిక్‌లో–4 చొప్పున 12 సీట్లు కేటాయించాలని గతేడాది మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఎన్‌ఎంసీ ఆదేశాల మేరకు జార్ఖాండ్‌లోని జంషెడ్‌పూర్ నుంచి డాక్టర్ మహ్మద్ సర్వర్ అలామ్ సిమ్స్‌లో బుధవారం తనిఖీ చేశా రు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. పీజీ సీట్లకు దరఖాస్తు చేసుకున్న జనరల్ సర్జరీవిభాగంలో సదుపాయాలు, ప్రొఫెసర్లు, క్లినిక ల్ మెటీరియల్ తదితర వివరాలను పరిశీలించారు.


