డీజేలకు అనుమతిలేదు | - | Sakshi
Sakshi News home page

డీజేలకు అనుమతిలేదు

Sep 10 2026 12:33 AM | Updated on Sep 10 2026 12:33 AM

పెద్దపల్లిరూరల్‌: గణపతి నవరాత్రి ఉత్సవాల ను శాంతియుతంగా జరుపుకోవాలని డీసీపీ రాంరెడ్డి సూచించారు. వినాయక మండప ని ర్వాహకులతో బుధవారం జిల్లా కేంద్రంలో స మావేశమయ్యారు. డీజే సౌండ్స్‌ అనుమతి లేదన్నారు. విగ్రహ ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో అనుమ తి పొందాలని సూచించారు. నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా సహకరించాలని కోరారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించేలా చర్యలు చేపట్టవద్దని చెప్పారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సైలు నరేశ్‌, మధుకర్‌, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మట్టి గణపతినే పూజించాలి

పెద్దపల్లి: మట్టితో తయారుచేసిన వినాయక వి గ్రహాలనే పూజించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుపై బుధవారం కలెక్టరేట్‌లో అవగాహన పో స్టర్‌ ఆవిష్కరించి సూచనలు చేశారు. టీజీపీ సీబీ అసిస్టెంట్‌ సైంటిస్‌ కనకజ్యోతి, ఏవో ప్రకాశ్‌, సూపరింటెండెంట్‌ కోటేశ్వర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.

రైస్‌మిల్లులు బంద్‌

పెద్దపల్లి: తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంతోపాటు సుల్తానాబాద్‌లో ని రైస్‌ మిల్లులను మిల్లర్లు బుధవారం మూసివేశారు. విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తదితర శాఖ ల అధికారులు రైస్‌మిల్లులపై దాడులు చేయడమే కాకుండా తమను నానా రకాలుగా వేధిస్తున్నారని రైస్‌మిల్లర్లు ఆరోపించారు.

సస్యరక్షణతో అధిక దిగుబడి

పెద్దపల్లిరూరల్‌: వరి, పత్తి పంట పంటలకు సో కిన చీడ, పీడలను సస్యరక్షణ చర్యలతో నివారి స్తే మేలైన దిగుబడి వస్తుందని కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త వెంకట రమేశ్‌, అధికారులు భా స్కర్‌రావు, వెంకన్న, వినోద్‌కుమార్‌ అన్నారు. పెద్దబొంకూర్‌లో ఏడీఏ శ్రీనాథ్‌, ఏవో నాగార్జు న వరి, పత్తి పంటలు పరిశీలించారు. వరిలో కాండం తొలుచుపురుగు నివారణకు కార్టప్‌హైడ్రోక్లోరైడ్‌ను లీటరు నీటిలో 2గ్రాములు కలిపి పిచికారీ చేయాలన్నారు. పత్తిలో రసం పీల్చేపురుగు నివారణకు అసెటమిప్రైడ్‌ మందును లీటరు నీటిలో 0.25 గ్రాములు కలిపి పిచికారీ చేయాలని సూచించారు. సర్పంచ్‌ కల్వల తిరుపతి, ఏఈవో కల్పన తదితరులు ఉన్నారు.

పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే

మంథని: పట్టణంలో పీరియాడిక్‌ లేబ ర్‌ ఫోర్స్‌ సర్వే నిర్వ హిస్తున్నట్లు గణాంక శాఖ అధికారి శ్రీ నివాస్‌గౌడ్‌ తెలిపా రు. బుధవారం ఆ ర్డీవో సురేశ్‌, తహసీల్దార్‌ ఆరిఫోద్దిన్‌, ఎంపీడీవో శ్రీజ, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌, మేనేజర్‌ శారదను కలిసి సర్వే పత్రాలు అందజేశారు. సర్వే లక్ష్యాలు, ప్రాముఖ్యత గురించి వివరించారు. ఉపాధి, నిరుద్యోగం, కార్మికశక్తి భాగస్వామ్యం, స్వ యం ఉపాధి తదితర అంశాలపై విశ్వసనీయ గణాంకాలను రూపొందించేందుకు సర్వే చేప ట్టామన్నారు. డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు, ఎంపీఎ స్‌వో సంధ్యారాణి, సిబ్బంది పాల్గొన్నారు.

‘క్రిటికల్‌ కేర్‌’పై సర్కార్‌ నజర్‌

కోల్‌సిటీ: గోదావ రిఖని ప్రభుత్వ జ నరల్‌ ఆస్పత్రి లో ని క్రిటికల్‌ కేర్‌ భ వనాన్ని ఉస్మాని యా ఆస్పత్రి మా జీ సూపరింటెండెంట్‌ రమావత్‌ పాండు నాయ క్‌ బుధవారం ఫొటోలు తీశారు. సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ హిమబిందుసింగ్‌, ఆర్‌ఎంవో కృపాభాయి, రేణుక తదితరులు పాల్గొన్నారు.

రూ.23.75 కోట్లతో భవన నిర్మాణం

ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌(పీఎం అభీమ్‌) కింద రాష్ట్రంలోని 31 వైద్య కళాశాలలకు అనుబంధంగా క్రిటికల్‌ కేర్‌ భవనాలు నిర్మించారు. రామగుండంలో రూ.23.75 కోట్లతో 50 పడకల సామ ర్థ్యంతో క్రిటికల్‌ కేర్‌ భవనం నిర్మించారు.

హుండీ ఆదాయం లెక్కింపు

కమాన్‌పూర్‌: శ్రీఆదివరాహస్వామి ఆలయ హుండీల ద్వారా ఆదాయం రూ.6,53,959 సమకూరినట్లు చైర్మన్‌ ముస్త్యాల దామోదర్‌, ఈవో కాంతారెడ్డి తెలిపారు. దేవాదాయ శాఖ అధికారి ప్రవీణ్‌, ప్రధాన అర్చకుడు కలకుంట్ల వరప్రసాచార్యులు, సర్పంచ్‌ రంగు సత్యనారాయణ, ఎస్సై ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement